Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'బంగార్రాజు' లైన్ నాగార్జునకి నచ్చలేదట!

నాగార్జున కెరియర్లో చెప్పుకోదగిన సినిమాల్లో ఒకటిగా 'సోగ్గాడే చిన్నినాయనా' కనిపిస్తుంది. ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నప్పుడే, 'బంగార్రాజు' పాత్ర ప్రధానంగా సీక్వెల్ వుంటుందనే విషయాన్ని నాగార్జున చెప్పారు. ఆ తరువాత అదే దర్శకుడు కల్యాణ్ కృష్ణ .. చైతూకి కూడా 'రారండోయ్ వేడుక చూద్దాం'తో హిట్ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ఇక 'బంగార్రాజు' సినిమా సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు.

అయితే అందుకు ఇంకా సమయం ఉందని నాగార్జున చెప్పారు. 'బంగార్రాజు' సినిమా కోసం కల్యాణ్ కృష్ణ తనకి ఒక లైన్ చెప్పాడనీ, అది అంత సంతృప్తికరంగా లేకపోవడంతో హోల్డ్ లో పెట్టానని అన్నారు. కల్యాణ్ కృష్ణ ఎప్పుడు తనని మెప్పిస్తే .. అప్పుడు 'బంగార్రాజు' బయటికి వస్తాడని చెప్పారు. ప్రస్తుతం కల్యాణ్ కృష్ణ ఈ స్క్రిప్ట్ పనిపైనే వున్నాడా? వేరే ప్రాజెక్టు పనిలో ఉన్నాడా ? అనేదే తెలియాల్సి ఉంది.     
nagarjuna

More Telugu News